నేడు అమ్మవారికి చందన అలంకారం

80చూసినవారు
నేడు అమ్మవారికి చందన అలంకారం
ప్రొద్దుటూరు స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆషాఢ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్త మిద్దె రఘురామిరెడ్డి తెలిపారు. అగస్త్యేశ్వర స్వామికి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన చేసి విశేషంగా చందన అలంకారం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్