గండిక్షేత్రం శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో వివిధ హక్కులకు సంబంధించిన సీల్డ్ టెండర్ల బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు డెకరేషన్ చేయుటకు వేలం పెట్టామన్నారు. చెప్పులు పెట్టుకోవడానికి, ఖాళీ ప్లాస్టిక్ సంచులు విక్రయించుటకు హక్కు తదితర బహిరంగ వేలాలు నిర్వహించామన్నారు.