పులివెందులలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని శనివారం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయులు, వసతి గృహాల సంక్షేమ శాఖ అధికారులు కలిసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హాస్టళ్ల మరమ్మతులు, వాటి బాగోగుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హాస్టళ్ల మరమ్మతులకు రూ. కోటి కేటాయించారన్నారు.