పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురంలో సోమవారం రాత్రి దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదేశాల మేరకు శానిటేషన్ సెక్రటరీ విజయ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది గ్రామ వీధులలో ప్రత్యేక వాహనం ద్వారా దోమల నివారణకు పొగమందును పిచికారి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.