పులివెందులలోని ఎమ్మెల్సీ ఇంటిలో నియోజవర్గంలోని పలు గ్రామాలు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శనివారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం పరిధిలోకి రాని వైద్య సేవలు పొందిన పేదలకు అండగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.