పులివెందులలోని రంగనాథ స్వామి ఆలయంలో ఈనెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ఆలయ ఈవో వెంకటరమణ, ఛైర్మన్ సుధీకర్ రెడ్డి తెలిపారు. ఉదయం స్వామి వారి దర్శనం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. శాశ్వత రథోత్సవ ఉభయదారులు, మహా కుంభాభిషేకం జరిపించిన దినేశ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ రంగనాథస్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణం ఉదయం 10 గం. నిర్వహిస్తామన్నారు.