వేంపల్లె: తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

85చూసినవారు
వేంపల్లె: తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
వేంపల్లి పట్టణం శ్రీరామ్ నగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త పైపులైన్ వేయాలని సర్పంచ్ శ్రీనివాసులు పంచాయతీ ఈవో సుబ్బారెడ్డిని కోరారు. మంగళవారం వేంపల్లి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పైపులైన్ లీకేజీలు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట వార్డు సభ్యులు సునీల్, వైసీపీ శ్రేణులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్