పుల్లంపేట వద్ద పుల్లంగేరు పై నిర్మించిన జాతీయ రహదారి వంతెన కూలడానికి సిద్ధంగా ఉందని సిఐటియు నాయకులు తెలిపారు. ఆదివారం సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వంతులకు పగుళ్లు వచ్చాయని, బ్రిడ్జి పైన బారీ వాహనాలు నడుస్తున్నప్పుడు బ్రిడ్జి ఉయ్యాల లాగా ఊగుతోందని అన్నారు. వెంటనే రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేశారు.