రైల్వే కోడూరులో ఆవుల యజమానులు విచ్చలవిడిగా ఆవులను పాలు పిండుకుని రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఆవులకు తినడానికి తిండి లేకపోవడంతో చెత్త డబ్బాల వద్ద వ్యర్ధాలను ఏరుకుని తిని రోడ్డుపైన పడుకుని ఉండడంతో ఆవులకు, ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఆవుల యజమానులకు తగిన జాగ్రత్తలు సూచించాలని వాహనదారులు కోరుతున్నారు.