క్షయ వ్యాధి నివారణకు వ్యాక్సిన్

77చూసినవారు
క్షయ వ్యాధి నివారణకు  వ్యాక్సిన్
రాపూరు మండలంలో నివసిస్తున్న ప్రతిఒక్కరూ క్షయ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్ ని తీసుకో వాలని డాక్టర్ పి. సుదర్శనమ్మ కోరారు. ఎంఈఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో 10 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక రూపొందించామని చెప్పారు. మే 16 నుంచి ప్రతి గురువారం ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు వారి పరిధిలో టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. అబ్దుల్సల్మాన్, సుప్రజ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్