తాగునీటి ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ రుణాలు

81చూసినవారు
తాగునీటి ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ రుణాలు
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాంక్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్