హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ ఆరోగ్యవంతులు ఏడాదికి ఒకసారి చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల వివరాలను ఎక్స్ వేదికగా తెలిపారు. ఇందులో హార్ట్ రేట్, బీపీ వంటి క్లినికల్ పరీక్షలతో పాటు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, హిమెగ్లోబిన్, విటమిన్ డి & బి12, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, ట్రెడ్మిల్ టెస్ట్, ఛాతీ ఎక్స్ రే, లిపిడ్ ప్రొఫైల్, కాలేయ పనితీరు పరీక్షలు వంటి 20కి పైగా టెస్టులను సూచించారు.