సిద్ధవటం అటవీ ప్రాంతంలో దిన చర్యలో భాగంగా అటవీ సిబ్బంది కుంబింగ్ చేపట్టారు. బద్రి కోన సమీపంలో కొంతమంది స్మగ్లర్లు 12 ఎర్రచందనం దుంగలు కారులో అక్రమ రవాణా చేసేందుకు సిద్ధమవుతుండగా వారిపై దాడి చేసారు. ఒక కారును 12 ఎర్రచందనం దుంగలు, ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేయడం జరిగిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి తెలియజేశారు.