కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శుక్రవారం నుండి పున ప్రారంభించాలని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య తెలియజేశారు. ఆయన గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ దసరా సెలవులు గురువారంతో ముగిసాయని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను శుక్రవారం నుండి పాఠశాలలకు పంపించాలని వారు సూచించారు.