మనదేశంలో కూడా పురుగులను ఇష్టంగా తింటారు? ఎక్కడో తెలుసా?

85చూసినవారు
చైనీయులు మాదిరిగానే మన దేశంలో కొందరు పురుగులను ఇష్టంగా తింటారని ఇన్‌ఫ్లుయెన్సర్ కావ్య ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒడిశాలోని ఎర్ర చీమల నుంచి తయారు చేసే చట్నీ తింటారని, తమిళనాడు, కర్ణాటకలో కొందరు చెద పురుగులతో వంట చేస్తారని తెలిపింది. నాగాలాండ్‌కు చెందిన ప్రసిద్ధ ఫ్రైడ్ సిల్క్ వార్మ్ డిష్, మధ్యప్రదేశ్‌లోని మోరియా తెగల పురుగుల లార్వా వంటకం గురించి తెలుపుతూ ఇవి భారతదేశ ప్రాచీన ఆహార సంస్కృతిలో భాగమని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్