కార్యకర్తల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంగళవారం రాజంపేట టిడిపి ఇన్ ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం చెన్నం శెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ గుడిలో పూజలు జరిగాయి. సుబ్రహ్మణ్యం హజరై అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు విని సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.