అందరూ నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి - కత్తి నరసింహారెడ్డి
ఎస్టీయు , యూటీఎఫ్ కార్యకర్తలందరూ ప్రత్యేక శ్రధ్ధ తీసుకొని అర్హులైన వారందరికీ ఫారం 19 లను అందజేసి, అందరూ ఓటర్లుగా నమోదయ్యే విధంగా కృషిచేయాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా ,రాజంపేటలో మంగళవారం ఎస్ టి యు , యు డి ఎఫ్ ఓ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫామ్ 18 ఫిలప్ చేసి సంబంధిత పత్రాలను జత చేసి తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 7వ తేదీ చివరి తేదీ కనుక అందరూ నమోదు అయ్యేలా చూడాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై. సుబ్రమణ్యం రాజు, రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ ఎన్. గోపాలరెడ్డి, ఎస్టీయు అన్నమయ్య జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అల్లం అశోక్ కుమార్, సత్యనారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి పిల్లి. రామకృష్ణ, ఎస్టీయు సీనియర్ నాయకులు ముద్దా ఆదిశేషారెడ్డి, యూటీఎఫ్ రాజంపేట అధ్యక్షులు రమణయ్య, రాజంపేట, నందలూరు, పెనగలూరు, పుల్లంపేట మండలాల ఎస్టీయు మండల నాయకులు, యూటీఎఫ్ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ కన్వీనర్లు, కో-కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.