ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే ఈ భేటీలో ఆయన ప్రధానంగా జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి భూపేందర్ యాదవ్‌తోనూ పవన్‌కల్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.