గీసుగొండ మండలం ఊకల్ గ్రామ పరిధిలో ఈజీఎస్ నిధులతో మంజూరైన ఫారం పాండ్ పనులకు మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనులు పూర్తి చేసిన కూలీలకు సన్మానం చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ లలో కొలతల ప్రకారం పని వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.