ఎమ్మెల్యేకి విప్ పదవి రావడం పట్ల బేపారి హర్షం

275చూసినవారు
ఎమ్మెల్యేకి విప్ పదవి రావడం పట్ల బేపారి హర్షం
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి ప్రభుత్వ విప్ పదవి రావడం పై రాయచోటి మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ సమన్వయకర్తగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి కి ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఎల్లవేళలా రాయచోటి అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి ముస్లిం మైనారిటీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్