చాపాడు: భూ సమస్యలను పరిష్కరించేందుకే సదస్సులు: తహసీల్దార్

85చూసినవారు
చాపాడు మండలంలోని సిద్దారెడ్డిపల్లె గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రమాకుమారి మాట్లాడుతూ.. రైతుల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు. రైతు నుంచి అందిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ కృష్ణారెడ్డి, రీసర్వే డీటీ నారాయణస్వామి, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్