రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాలతో ప్రమాదం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.