ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రి చిన్నమండెం మండలం తూర్పు పల్లెలో ఎంపీ యుపి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నారు.