రాయచోటిలోని గాలివీడు రింగ్ రోడ్డు - భారత్ పెట్రోల్ బంకు రోడ్డు మార్గంలో యువకులు గంజాయి మత్తులో ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్ చేసారు. ఈ క్రమంలో వాహనదారులు, పాదచారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.