కారు-ఆటో ఢీ..ఒకరు దుర్మరణం
కడప జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి బొగ్గడివారిపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఆటో ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా..నలుగురు గాయాలయ్యాయి. ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.