ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠినమైన చర్యలు తప్పవు

69చూసినవారు
ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠినమైన చర్యలు తప్పవు
రాత్రి వేళలలో ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠినమైన చర్యలు తప్పవని విఆర్వో కేశవులు అన్నారు. మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామ సచివాలయంలో సోమవారం మాట్లాడుతూ సిద్ధవటం పెన్నా నది బ్రిడ్జి వద్ద రాత్రి వేళల్లో జెసిబి యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి రవాణా జరుగుతున్నట్లు సిద్ధవటం రైతులు ఫిర్యాదు చేశారన్నారు. రాత్రి వేళలో నిఘా ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్