రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి కడపకు వెళుతున్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బద్వేలు టౌన్ బోయినపల్లికు చెందిన శ్రీనివాసులు, గోపయ్యలకు గాయాలయ్యాయి. 108 వాహనంలో కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.