కడప జిల్లాలోని సిద్దవటం, అట్లూరు పోలీసు స్టేషన్లను బుధవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లలోని రికార్డులను పరిశీలించారు. ఎస్. ఐ లు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారుల నుండి పిటిషన్ తీసుకుని నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.