Feb 27, 2025, 14:02 IST/
పోలీసుల ప్రశ్నలకు 'లవ్ యూ రాజా' అని సమాధానమిచ్చిన పోసాని!
Feb 27, 2025, 14:02 IST
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. దాదాపు 7గంటలుగా విచారణ చేస్తున్నారు. అయితే విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదు, అవునా? అంటూ దాటవేస్తున్నారని అంటున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. ‘లవ్ యు రాజా’ అంటూ తనదైన శైలిలో సమాదానమిచ్చినట్లు తెలుస్తోంది.