AP: ఉగాది నుంచి P4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్) విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేదలకు సాధికారత కల్పించడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. P4 పథకం పైలట్ ప్రాజెక్టును ముందుగా 4 గ్రామాల్లో అమలు చేసి 5,869 కుటుంబాలకు ప్రయోజనం పొందేలా చేస్తామని సీఎం తెలిపారు.