పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో తెలంగాణ సర్కారు ముస్లిం ఉద్యోగులకు ఇప్పటికే శుభవార్త చెప్పగా.. హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలలో బోధనా సమయాన్ని తగ్గించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా విద్యాసంస్థల యాజమాన్యాలు సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు మార్చి 3 నుండి, కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే క్లాస్‌లు జరపనున్నట్లు సమాచారం.