AP: విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో సిబ్బంది నిర్వాకానికి పేషేంట్లు తీవ్ర ఆందోళనకు దిగారు. వార్డులో డ్యూటీ ముగిసిన హడావుడిలో సిబ్బంది బిడ్డలను తారుమారు చేశారు. ఒకరి బిడ్డను మరొకరికి అప్పగించారు. ఈ క్రమంలో డెలివరీ కాకముందే గైనిక్ సిబ్బంది ఓ మహిళకు బిడ్డను అందజేశారు. సిబ్బంది నిర్లక్ష్యానికి పేషేంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో KGHలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.