గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే మైకెల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా బీచ్‌లలో ఇడ్లీ సాంబార్, వడాపావ్ వంటి విక్రయాల కారణంగానే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గుతోందని లోబో వెల్లడించారు. గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని, అందరూ దీనికి బాధ్యులేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.