టిక్‌టాక్ సంస్థకు పోటీ ఇచ్చేందుకు మెటా సంస్థ సిద్ధమవుతోంది. ఇన్‌స్టా రీల్స్ కోసమే ప్రత్యేకంగా మరో యాప్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి ఈ విషయాన్ని తమ సిబ్బందికి వెల్లడించినట్లు సమచారం. అలాగే రీల్స్‌లో 3 నిమిషాల వీడియోలు కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. బైట్‌డ్యాన్స్‌లో 50 శాతం వాటాను అమెరికా సంస్థకు అమ్మేస్తే టిక్‌టాక్‌పై నిషేధం తీసేస్తామని ట్రంప్ తెలిపిన సంగతి తెలిసిందే.