తంబళ్లపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆన్లైన్ లో సదరం స్లాట్ నమోదు చేసుకున్న 20 మందికి పరీక్షలు నిర్వహించారు. తంబళ్లపల్లి పట్టణంలో ప్రతివారం నిర్వహిస్తున్న సదరం శిబిరాలను దివ్యాంగులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ వెంకటరామయ్య ప్రజలను కోరారు.