రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
వల్లూరు మండలం ఈతచెట్టు గ్రామ సమీపాన మంగళవారం రాత్రి లారీ, ద్విచక్ర వాహనంను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు వల్లూరు మండలం కట్ట గ్రామానికి చెందిన జరిగాళ్ల బాబు (25) గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.