ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు,, జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య,పోలీస్, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి, సంఘీభావం తెలుపుతూ కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తన కుటుంభసభ్యులతో కలిసి వారి నివాసం వద్ద చప్పట్లు కొట్టారు. చప్పట్లుతో..వారందరికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్బంగా డిన్నార్ మాట్లాడుతూ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరు స్వచ్చందంగా జనతా కర్ఫ్యులో భాగంగా,అధికారులకు పూర్తిగా సహకరించాలని, ఇది మన అందరి బాధ్యత అని అన్నారు,, అలాగే మన అందరికీ కనపడే దేవుడు వైద్యులు మాత్రమే అని, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపుతున్నామన్నారు.