పెద్దాపురం శతాబ్ది పార్కు దుస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దాపురం పట్టణ శివారున శతాబ్ది పార్కు నిర్వహణ విస్మరించడంతో ఆహ్లాదం కరువైందన్న ప్రజల ఆరోపణల మేరకు వాస్తవ స్థితిగతులను పరిశీలించేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం సాయంత్రం సందర్శించారు. పెద్దాపురం టీడీపీ నాయకులు రాజా సూరిబాబు రాజు తదితరులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. పార్కుకు తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్