శ్రీ వన దుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా చండీ హోమం

81చూసినవారు
కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఘనంగా చండీ హోమం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ వనదుర్గ అమ్మవారిని వివిధ రకముల పుష్పములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు అమ్మవారికి శ్రీ సూక్తం పురుష సూక్తం మూల మంత్రములు నవగ్రహ అర్చన నిర్వహించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించిన భక్తులకు వేద పండితులు వేద ఆశీర్వచనం గావించి గా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు , ఆలయ అర్చకులు , వ్రత పురోహితులు, పి అర్ ఓ దామోర్ల కృష్ణారావు , దేవస్థానం అధికారులు, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్