ప్రతిపాడు: పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సౌత్ జోన్ డిఎస్పి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ ను గురువారం సౌత్ జోన్ డిఎస్పి భానోదయ తనిఖీ చేశారు. ప్రతిపాడు సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామని మీడియాకు తెలిపారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టి త్వరలోనే పరిష్కార మార్గం చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.