కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మంగళవారం ఉగాది సందర్భంగా ప్రధాన ఆలయమంతా వివిధ రకముల పుష్పములతో అలంకరించారు.
వేద పండితులు , ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల
ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యములు నడుమ తీసుకుని వచ్చి
అని వేటి మండపంలో అత్యంత సుందరముగా వివిధ రకముల పుష్పములతో అలంకరించి సింహాసనం పై ఆసీనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవ మూర్తులను వెండి రథంపై ఆసీను భావించి ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తుల నామ స్మరణ మధ్య ముమ్మారు ప్రదక్షిణ గావించారు. ఉగాది సందర్భంగా శ్రీ స్వామివారి సన్నిధికి
నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. కళ్యాణ వేదిక వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం ఎదురుగా ఉన్న సెక్యులర్ వద్ద వచ్చిన భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. వచ్చిన భక్తులకు దర్శనం క్యూలైన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పిఆర్ఓ విభాగం వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.