ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు

82చూసినవారు
ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు
తుని పట్టణంలో ఉన్న తాండవ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా చేయరాదన్నారు. గృహ నిర్మాణదారులు సొంత అవసరాలకు ఎడ్ల బండ్లపై ఇసుక తీసుకువెళ్లవచ్చని ఆయన తెలిపారు. ఎక్కడైనా ఇసుక డంప్ ఏర్పాటు చేసిన కేసులు తప్పవన్నారు. ఇసుకపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్