తుని 23వ వార్డు ఉప్పరగూడెంలో కొత్త కాలనీలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్తిబాబు జాతీయ జండాను ఆవిష్కరించి అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పల్లెల హనుమంత్, చెక్కల అప్పారావు, నరాలశెట్టి సత్యనారాయణ, దిబ్బ గోవింద్, గాండ్రేడ్డి రాజు, శనపల్లి రమణమ్మ, సిద్ధాంతపు వీరబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గున్నారు.