ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు.. ప్రజా సంస్థ అని కొనకళ్ల ఈ సందర్భంగా అన్నారు. ప్రజలపై భారం వేయకుండా కార్గో ద్వారా ఆదాయం పెంచుకుంటామని తెలిపారు. ఆర్టీసీలో కార్గో రవాణాను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.