వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సినీ ఇండస్ట్రీ సమస్యలపై జగన్‌తో చర్చకు వచ్చి చిరంజీవి కావాలనే జగన్‌కు దండం పెట్టారు. దీన్ని రిపబ్లిక్ సినిమా ఈవెంట్‌లో పవన్ రైజ్ చేశాడు. సీఎం రేవంత్‌తో టాలీవుడ్ పెద్దల సమావేశం సమయంలో చిరంజీవి ఎందుకు వెళ్లలేదు. అల్లు అర్జున్‌కు మద్దతుగా ఉండాల్సిన వీళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు" అని విమర్శించారు.