సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

70చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడి గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులోనే అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న.’ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్