హెలికాప్టర్లతో ‘మగ దోమలు’ విడుదల.. ఎక్కడో తెలుసా?

54చూసినవారు
హెలికాప్టర్లతో ‘మగ దోమలు’ విడుదల.. ఎక్కడో తెలుసా?
అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు అమెరికాలోని హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సాయంతో ఇప్పటికే కోటి దోమలను వదిలినట్లు అంచనా. హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. US నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్