అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి సమస్యలపై 220 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.