అమలాపురం విద్యుత్ నగర్ లో తాచు పాము హల్చల్ చేసింది. రావూరి వెంకటేశ్వరరావు గురువారం ఇంటి వద్ద తాచుపాము రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయాభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో ఉన్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం అందించారు. వర్మ సంఘటన స్థలానికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి దూర ప్రాంతంలో వదిలేశారు.