అమలాపురంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న ప్రెస్ క్లబ్ సమీపంలో మంగళవారం రాత్రి ఫ్లెక్సీ కడుతున్న యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. 11 కేవి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్లెక్సీ కడుతుండగా ఐరన్ ఫ్రేమ్ కు విద్యుత్ తీగలు తగిలి ఆ యువకుడు విద్యుత్ షాక్ కు గురైనట్లు స్థానికులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడికి స్థానికులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు.